పోయేకాలం: సన్యాసి పాలన… సన్నాసి మాటలు!  

-

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లో ఇటీవ‌ల యువ‌తులపై జరుగుతున్న అత్యాచారాల సంఘటనలు దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్ర‌హం క‌లిగిస్తున్నాయి! ఈ విషయంలో రాహుల్ గాంధీ – ప్రియాంక గాంధీల పరామర్శను సైతం యూపీ పోలీసులు అడ్డుకోవడంతో.. ఈ వ్యవహారం కాస్త బీజేపీకి బ్యాడ్ అయ్యి కూర్చుంది. ఈ సంఘటనలు, వాటిపై కంగ్రెస్ పార్టీ స్పందనలతో బీజేపీ ఇరుకున పడింది! దేశవ్యాప్తంగా బీజేపీపై విమర్శల వర్షాలు కురుస్తున్నాయి! అది చాలదన్నట్లు పార్టీని మరింత ఇరుకునపడేశాడు ఆ పార్టీ ఎమ్మెల్యే బ‌ల్లియా సురేంద్ర సింగ్!

అవును… “అత్యాచారాలను ఆపడానికి తల్లిదండ్రులు తమ కుమార్తెలకు మంచి విలువలు నేర్పించాలి” అని చెప్పుకొచ్చాడు బీజేపీ ఎమ్మెల్యే బల్లియ సురేంద్ర సింగ్! ఈ లైన్ చదివినివారు సరిగ్గానే చదివారు.. చెప్పినోడే సరిగ్గా చెప్పలేదు! “అత్యాచారాలను ఆపడానికి తల్లిదండ్రులు తమ కుమారులకు మంచి విలువలు నేర్పించాలి” అని చెప్పాల్సిన నోటితో ఇలా తనదైన వక్రబుద్దిని బయటపెట్టుకున్నాడు! ఆయ‌న ప్ర‌క‌ట‌న‌పై రాజ‌కీయ పార్టీలు భ‌గ్గుమంటున్నాయి.

అక్కడితో ఆగకుండా తన మూర్ఖత్వాన్ని అజ్ఞానాన్ని మరింత ప్రదర్శించిన ఆయన… “అత్యాచార సంఘటనలను ఆపడానికి యువతుల తల్లిదండ్రులు వారిలో మంచి విలువలను పెంపొందించేలా చూడాలి.. ఇలాంటి అత్యాచార సంఘటనలను సంస్కృతి, విలువలుతో మాత్రమే ఆపవచ్చు తప్ప పాలన లేదా కత్తితో కాదు” అని పలికారు! దీంతో… ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో యువ‌తుల అత్యాచారాల‌కు ఆ యువతులే కారణం అన్నట్లు, వారికి విలువలు లేనట్లు, అలా పెంచిన తల్లితండ్రులే నేటి అత్యాచారాలకు కారణం అన్నట్లు ఎమ్మెల్యే మాట‌లున్నాయ‌ని దేశవ్యాప్తంగా మహిళలు, నెటిజన్లు, యువత మండిప‌డుతున్నారు.

ఒక ఎమ్మెల్యే ఇలాంటి మాటలు మాట్లాడటం కంటే నీచత్వం మరొకటి ఉంటుందా? దేశంలో ప్రజలను ఇలాంటి మూర్ఖులు పాలిస్తున్నారని తెలిసినప్పుడల్లా.. దేశం ఎక్కడికిపోతుందనే భయాలు విపరీతంగా వస్తుంటాయనే కామెంట్లు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి! ఫలితంగా… యూపీలో జరుగుతున్న ఘోరాలతో “సన్యాసులు పాలకులైతే పరిస్థితులు ఇలానే ఉంటాయని” కాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తుంటే… “సన్నాసులు ఎమ్మెల్యేలు అయితే ఇలాంటి మాటలే వస్తాయి” అని దేశవ్యాప్తంగా నెటిజన్లు ఫైరవుతున్నారు!

-CH Raja

Read more RELATED
Recommended to you

Exit mobile version