ఎంపీ రఘురామ అరెస్టు అయినప్పటి నుంచి ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతున్నాయి. ఇక ఆయన అరెస్టు అయిన వెంటనే కేసు జిల్లా కోర్టు నుంచి హై కోర్టుకు, ఆ వెంటనే సుప్రీంకోర్టుకు మారింది. ఇక సుప్రీంకోర్టుకు కేసు చేరగానే.. రఘురామ కుమారుడు భరత్, కూతురు ఇందు ప్రియదర్శిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు.
తమ తండ్రిని వేధిస్తున్నారంటూ సీఎం జగన్‌పై ఫిర్యాదు చేశారు. అయితే వారు బీజేపీని ఎందుకు కలిసినట్టు అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర బీజేపీ పెద్దలు ఎంపీ అరెస్టుపై నోరు విప్పకపోవడం ఇక్కడ గమనార్హం.
ఇక వారు కలిసిన రెండు రోజులకే సుప్రీంకోర్టు ఎంపీకి బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఎంపీ రఘురామకు బీజేపీ ఇన్‌డైరెక్ట్‌గా సపోర్టు చేస్తుందనే వాదన వినిపిస్తోంది. అయితే దీనిపై బీజేపీ పెద్దలు మాత్రం మౌనం వహిస్తున్నారు. కానీ రఘురామ కూతురు, కుమారుడు ప్లాన్ ప్రకరామే అమిత్‌షాను కలిసినట్టు స్పష్టం అవుతోంది. ఈ టైమ్‌లో బీజేపీ మాత్రమే తమను కాపాడగలదని వారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ విషయంపై బీజేపీ నోరు విప్పుతుందా లేదా అనేది చూడాలి.