ఎన్నార్సి అంటే మమతకు భయం ఎందుకు…?

-

ఎన్నార్సి… ఇప్పుడు దేశంలో వివాదాస్పదంగా మారిన వ్యవహారం… ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, బీహార్ సహా అనేక రాష్ట్రాలలో ఇప్పుడు దీనిపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అసోం లో నిరసనలు తీవ్ర స్థాయిలో జరగడంతో కేంద్రం అక్కడ బలగాలను మోహరించింది. అటు బీహార్ లో… ఆర్జెడి, కాంగ్రెస్ పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దేశంలో హిందుత్వ ఓట్ల కోసమే బిజెపి దీనిని తీసుకొచ్చిందని… ఇతర పార్టీలను ఇబ్బంది పెట్టేందుకు వ్యవహరిస్తుందని ఏవేవో విమర్శలు చేస్తున్నాయి ఆ పార్టీలు.

అసలు వాళ్ళు ఎందుకు విమర్శలు చేస్తున్నారు…? దేశంలో ఉండే పౌరులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని బిజెపి ప్రభుత్వం చెప్తున్నా ఎందుకు ఇష్టపడటం లేదు…? ఒక్కసారి చూద్దాం… మమత ముఖ్యమంత్రి కావడానికి ఎక్కువగా ఉపయోగపడింది నేపాల్, భూటాన్, బంగ్లాదేశీయులే అనేది బిజెపి భావన… ఆయా దేశాల నుంచి… బీహార్.. అసోం నుంచి దేశంలోకి గత పదేళ్ళలో దాదాపు 16 లక్షల మందికి పైగా వచ్చారు అనేది బిజెపి అంచనా… వాళ్ళందరికీ కూడా మమత ఉపాధి కల్పించడం, ధృవీకరణ పత్రాలు ఇవ్వడం వంటివి చేసారు…

ఓటు హక్కు నమోదు కూడా వారికి భారీగా చేసారు. మమత విజయంలో వాళ్ళు కీలక పాత్ర పోషించారు. బీహార్ లో నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా కనపడుతూ ఉంటారు. వారికి అక్కడ నితీష్ కుమార్ సర్కార్ భారీగా ఓట్లు ఇచ్చింది అనే ఆరోపణలు ఉన్నాయి. ఝార్ఖండ్ లో కూడా వారి సంఖ్య భారీగానే ఉంది. బంగ్లాదేశ్ సరిహద్దు గ్రామాలు… ఆ దేశ రాజధాని అయిన డాకా చుట్టు పక్కల ఉన్న నగరాలు గ్రామాల నుంచి భారీగా వచ్చారు. ఇక రోహింగ్యా ముస్లిం లు కూడా బెంగాల్ లో ఎక్కువగానే ఉన్నారు.

బెంగాల్ లో బిజెపి అధికారంలోకి రావాలి అంటే ముందు వీళ్ళను దేశం నుంచి పంపించాలి… అలాగే బీహార్ లో కూడా అధికారంలోకి రావడానికి నీతీష్ సహకారం లేకుండా… వీళ్ళను పంపించాలి… ఇక అక్కడ కాంగ్రెస్… ఆర్జెడి పార్టీలను భారీగా ఈ బిల్లు ద్వారా దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది. ఇక జమ్మూ కాశ్మీర్ లో కూడా బలపడే అవకాశం ఉంటుంది. అందుకే బిజెపి ఇప్పుడు ఈ విషయంలో సీరియస్ గా ఉందనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఇది అమలు జరిగితే మాత్రం… బెంగాల్, బీహార్ లో బిజెపికి భారీగా కలిసి వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version