కరోనా టెస్ట్ చేద్దామంటే సైఫ్ అలీఖాన్ దొరకట్లేదు..అధికారులు సీరియస్..!

-

బాలీవుడ్ నటి కరీనా కపూర్ కు ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. కరీనా కపూర్ తో పాటు అమృత అరోరా కరణ్ జోహార్ ఇంటికి డిన్నర్ కు వెళ్లారు. అయితే వీరిద్దరికీ సోమవారం కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అయితే వీరిద్దరూ కరోనా నిబంధనలు ఉల్లంఘించి ముంబై లోని పలు పార్టీలకు తిరిగిరానిలో బిఎంసీ అధికారులు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా కరీనా కుటుంబసభ్యులు ట్రేసింగ్ కు సహకరించడం లేదని పేర్కొన్నారు. సైఫ్ అలీఖాన్ ఎక్కడ ఉన్నారో చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నిసార్లు ప్రశ్నించినా ముంబై లో లేరు అనే సమాధానం ఇస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం కాంటాక్ట్ ట్రేసింగ్ జరుగుతుంది అని సేకరించిన నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపిస్తామని చెప్పారు. ఇక ఇప్పటికే కరోనా ఇంటిని కూడా అధికారులు సీజ్ చేశారు. ఇదిలా ఉండగా కరీనా కపూర్ అధికారి మాత్రం మరోలా చెబుతున్నారు. కరీనా చాలా బాధ్యత యుత పౌరురాలు అని ఆమె లాక్ డౌన్ సమయంలో ఎంతో బాధ్యతా యుతంగా వ్యవహరించారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version