బాలీవుడ్‌లో విషాయం.. క‌రోనాతో దిలీప్‌ కుమార్‌ సోదరుడి మృతి

-

బాలీవుడు సీనియర్ యాక్ట‌ర్‌ దిలీప్‌ కుమార్‌ సోదరుడు ఇషాన్‌ఖాన్‌ (90) గురువారం తెల్లవారుజూమున కన్నుమూశారు. ఆయ‌న‌ కొంతకాలంగా గుండెజబ్బు, అల్జీమర్స్‌తో బాధపడుతున్నారు. ఈ క్ర‌మంలోనే గత నెల 16న కరోనా వైర‌స్‌ బారినపడ్డారు. దీంతో ముంబైలోని లీలావతి హాస్పటల్‌లో ఆయ‌న చికిత్స పొందుతున్నారు. అప్ప‌టి నుంచి వెంటిలేటర్‌పైనే ఉన్న ఇషాన్‌ఖాన్‌ తెల్లవారుజూమున పరిస్థితి విషమించి మృతి చెందారు.

దిలీప్‌ కుమార్‌ మరో సోదరుడు అస్లాంఖాన్‌ (89) సైతం కరోనా బారినపడి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇషాన్‌ఖాన్‌ మృతితో దిలీప్‌ కుమార్‌ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతికి పలువురు బాలీవుడు నటులు, దర్శకులు సంతాపం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version