Shahid Kapoor : సమంత, బన్నీతో యాక్ట్ చేయాలని ఉందన్న బాలీవుడ్ స్టార్ హీరో

-

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన వ్యక్తిగా రాజమౌళి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే తెలుగు వారి సత్తాను ఇతర ఇండస్ట్రీలు చూసి గౌరవించడమే కాదు.. డౌన్ సౌతిండియాలో అద్భుతమైన ఫిల్మ్ మేకర్స్ ఉన్నారనే గుర్తింపు రాజమౌళి వల్లే వచ్చిందని సినీ పరిశీలకులు చెప్తుంటారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం భారత దేశంలోని ఇతర సినిమా ఇండస్ట్రీల చూపు తెలుగు ఇండస్ట్రీ వైపే ఉందని చెప్పొచ్చు.

మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీ టాలీవుడ్ పైనే ఫోకస్ చేస్తున్నది. ఇక్కడి హీరోల చిత్రాలు ఎలా వర్కవుట్ అవుతున్నాయి? ఏయే సినిమాలు ఎవరెవరు తీస్తున్నారు? దర్శకుల పని తీరు ఎలా ఉంటున్నది? అనే అంశాలపైన వారు తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ సంగతులు పక్కనబెడితే.. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కు తెలుగు సినిమాలు బాగా కలిసొచ్చాయని చెప్పొచ్చు. సూపర్ హిట్ ఫిల్మ్ ‘అర్జున్ రెడ్డి’ని హిందీలో ‘కబీర్ ఖాన్’ గా రీమేక్ చేసి విజయం అందుకున్నాడు షాహిద్ కపూర్.

ఈ క్రమంలోనే నేచురల్ స్టార్ నాని నటించిన నేషనల్ అవార్డు విన్నింగ్ ఫిల్మ్ ‘జెర్సీ’ని కూడా రీమేక్ చేశారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ డ్రామ ఈ నెల 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరో, హీరోయిన్, డైరెక్టర్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. మీడియాతో ముచ్చటిస్తున్న క్రమంలో తెలుగులో ఎవరెవరితో నటించాలని ఉందనే ప్రశ్నించగా, షాహిద్ ఆసక్తికర సమాధానాలచ్చారు.

రాజ్ అండ్ డీకే ప్రాజెక్ట్ కోసం తాను సమంతతో కొలాబరేట్ అయ్యానని, ఆమెతో పని చేయడం బాగుంటుందని అన్నాడు షాహిద్. ఈ క్రమంలోనే తనకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో యాక్ట్ చేయాలని ఉందని తెలిపాడు షాహిద్ కపూర్. ‘జెర్సీ’ ఫిల్మ్ నుంచి విడుదలైన పాటలకు, ట్రైలర్ కు చక్కటి స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే మూవీ సక్సెస్ అవుతుందని మూవీ యూనిట్ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version