నోటీసులు ఇప్పించినంత మాత్రాన టీడీపీ అధినేత అవినీతి పరుడు కాడు : బోండా ఉమ

-

టీడీపీ అధినేత చంద్రబాబు నాయకుడుకు ఐటీ నోటీసులు ఇవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ అంశంపై వైసీపీ నేతలు చంద్రబాబును టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ స్పందిస్తూ.. జగన్ రెడ్డి ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసి, చంద్రబాబుకి తప్పుడు నోటీసులిప్పించారని ఆరోపించారు. నోటీసులు ఇప్పించినంత మాత్రాన టీడీపీ అధినేత అవినీతి పరుడు కాడని, విష ప్రచారం చేస్తేనో, వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తేనో చంద్రబాబు తప్పు చేసినట్టు కాదన్నారు బొండా ఉమ. అవినీతి సామ్రాట్ జగన్హ రెడ్డి నీతిమాలిన చరిత్ర వైసీపీ నేతలకు తప్ప దేశమంతా తెలుసునని, 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏ మచ్చా, ఎలాంటి అవినీతి మరక లేని ఏకైక నాయకుడు దేశంలో చంద్రబాబు ఒక్కడే అన్నారు.

అంతేకాకుండా.. ‘చంద్రబాబుకి వచ్చిన ఐటీ నోటీసులపై జవాబు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు వద్ద గతంలో పీఎస్ గా పనిచేసిన శ్రీనివాస్ ఇంట్లో జరిగిన ఐటీ సోదాలపై అప్పుడే అసెస్ మెంట్ ఆర్డర్ఇవ్వడంతో ఐటీ విభాగం సంతృప్తి చెందింది. ఏమీ లేనిదాన్ని ఉన్నట్టు చిత్రీకరిస్తూ, విషప్రచారంతో ప్రజల్ని నమ్మించడం జగన్ రెడ్డికి, అతని కుటుంబానికి బాగా అలవాటే. గతంలో రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు అవినీతి చేశాడంటూ హౌస్ కమిటీలు వేసి, ఏమీ నిరూపించలేక భంగపడ్డాడు. జగన్ తల్లి విజయమ్మ కోర్టుల్లో కేసులు వేసి, ఆధారాలు చూపలేక వాటిని వెనక్కు తీసుకుంది. ప్రతిపక్షంలో ఉండి చంద్రబాబు రూ.6లక్షల కోట్ల అవినీతి చేశాడని, తప్పుడు సమాచారంతో పుస్తకాలు ముద్రించిన జగన్ రెడ్డి నాలుగేళ్లలో ఏం నిరూపించాడు?. ప్రజల్లో తనపై పెరుగుతున్న ఈర్ష్యాద్వేషాలను కప్పిపుచ్చడానికే జగన్ రెడ్డి.. చంద్రబాబుకి ఐటీ నోటీసులని దుష్ప్రచారం మొదలెట్టాడు. అవినీతి పునాదులపై పుట్టిన వైసీపీచంద్రబాబు, టీడీపీపై దుష్ప్రచారంతో శునకానందం పొందుతోంది.’ అని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version