రేపు జరిగే తిరుపతి సభ..టీడీపీ రాజకీయ సభ : బొత్స

-

తిరుపతిలో రేపు రాజకీయ సభ జరుగుతుందని.. అది అమరావతి రైతులు సభ కాదు టీడీపీ రాజకీయ సభ కాదని మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. విజయవాడ నుంచి తిరుపతి వరకు జరిగిన పాదయాత్రలో టీడీపీ వాళ్ళు మినహా ఎవరైనా స్వచ్చందంగా వచ్చారా? చంద్రబాబు, టీడీపీ అజెండా 29 గ్రామాలు, ఆ సమాజికవర్గాన్ని అభివృద్ధి చేయడమన్నారు. మా అజెండా రాష్ట్రాన్ని, అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయడమని.. రాజధాని రైతులు ది త్యాగం అని చంద్రబాబు అంటున్నారని అగ్రహించారు. నాగార్జున సాగర్, పోలవరం కట్టడానికి వేల మంది రైతులు భూములు ఇచ్చారు.. వారిది త్యాగం కాదా? అని నిలదీశారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, ఒక సామాజిక వర్గం అభివృద్ధి చెందడం త్యాగమా? మేము అమరావతి ప్రాంతానికి వ్యతిరేకం కాదన్నారు. చంద్రబాబు నాయుడు కి ఒక అజెండా, దోపిడీ కార్యక్రమం ఉందని.. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఎగ్జిక్యూటివ్ కాపిటల్ వద్దని అచ్చం నాయుడుకి ఎవరు చెప్పారన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం, జాతి సంపాదని దోచుకుంటు త్యాగం అంటున్నారు…ఏంటి త్యాగం అని నిలదీశారు. తిరుపతి సభలో వైసీపీ వాళ్ళు ఆల్లర్లు సృష్టిస్తారు అని అచ్చం నాయుడు అంటున్నారు…మిరే అల్లర్లు సృష్టించేలా వున్నారన్నారు. అమరావతి లో అవినీతి జరిగింది అని ప్రధాని మోడీ అన్నారు… రాజకీయ ఉద్దేశాల తో బీజేపీ వాళ్ళు స్టాండ్ మార్చుకున్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news