రాజ్య‌స‌భ : బాబు స్నేహంలో బొత్స !

-

చంద్ర‌బాబు స్నేహంలో మంత్రి బొత్స ఉన్నారు.ఎప్పుడూ పైకి తిడుతూ రుస రుస లాడుతూ క‌నిపించే బొత్స పైకి అలా ఉన్నా లోప‌ల మాత్రం ఆయ‌న‌కు టీడీపీ అంటే ప్రేమే ఉండ‌వ‌చ్చు. ఉన్నా త‌ప్పేం కాదు.ఎందుకంటే విజ‌య‌న‌గ‌రం రాజ‌కీయాల్లో ఎంతో రాణించిన బొత్స‌కు ఓ విధంగా ఎన్నో సంద‌ర్భాల్లో సాయం చేసింది మాజీ మంత్రి, ఓ విధంగా టీడీపీ బాస్ అశోక్ గ‌జ‌ప‌తి రాజే అన్న‌ది ఓపెన్ సీక్రెట్.

క‌నుక బాబు స్నేహాన్నీ అదే విధంగా ఆయ‌న‌తో ఉండే ప‌రిచ‌యాలు వేటినీ ఆయ‌న వ‌ద్ద‌నుకోరు.అందుకే టీడీపీ అధికారంలో ఉన్నా బొత్స ఆస్తుల జోలికి ఎవ్వ‌రూ వెళ్ల‌రు.వెళ్లే సాహ‌సం కూడా చేయ‌రు.అంతేకాదు పైకి అమ‌రావ‌తి విష‌య‌మై పెడ‌స‌రంగా మాట్లాడినా వ్య‌తిరేకించినా లోప‌ల మాత్రం ఆయ‌న‌కు  మాత్రం అక్క‌డ ఆస్తులు కూడ‌బెట్టుకోవాల‌న్న ఆలోచ‌న ఉండ‌దా ఏంటి?

అస‌లు వైజాగ్ క‌న్నా విజ‌య‌వాడ ప‌రిస‌ర ప్రాంతాల‌ను వేగంగా అభివృద్ధి చేశాక భూములు కొన్న‌దే వైసీపీ. అమ‌రావ‌తిలో బొత్స‌కూ ఆస్తులున్నాయో లేవో కానీ దాదాపు అంద‌రి ముఖ్య నేత‌ల‌కూ (పార్టీల‌కు అతీతంగా) ఆస్తులున్నాయి.దీనికే తెలివిగా దెప్పి పొడుస్తూ జ‌గ‌న్ ఇన్ సైడ్ ట్రేండింగ్ అంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు అని హైకోర్టు కూడా తేల్చేసింది.

క‌నుక రాజ‌ధాని పై బొత్స అలా మాట్లాడినా కూడా బాబుపై ఉండే ప్రేమ ఎక్క‌డికీ పోదు.అందుకు తార్కాణంగా నిల‌వ‌బోతున్నదే రేప‌టి వేళ జ‌రిగే రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లు. అవే ఇప్పుడు కీల‌కం కానున్నాయి. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లలో బీజేపీ త‌ర‌ఫున ఆజాద్ బ‌రిలో ఉండ‌నున్నారు. ఆజాద్ త‌ర‌ఫున ఆంధ్రా పార్టీలో పొలిటిక‌ల్ లాబీయింగ్ జ‌రిపేందుకు బొత్స బ‌రిలో ఉన్నారు.ఇప్ప‌టికే ఇరువురు చ‌ర్చ‌లు కూడా జ‌రిపారు అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version