కరోనా వైరస్ దెబ్బకు ఇప్పుడు ప్రజలు భయపడిపోతున్నారు. ఇది ఏ విధంగా కట్టడి అవుతుందో తెలియక ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలనే కాదు కరోనా ప్రముఖులను కూడా బాగా ఇబ్బంది పెడుతుంది. బ్రిటన్ అధ్యక్షుడు, ఇజ్రాయెల్ అధ్యక్షుడు, పలు రాష్ట్రాల గవర్నర్లు ఇలా కరోనా వైరస్ సోకడం ఇప్పుడు కలవరపెట్టే అంశం. తాజాగా బ్రెజిల్ లో ఒక రాష్ట్ర గవర్నర్ కి కరోనా సోకింది.
బ్రెజిల్ దేశంలోని రియో డి జనీరో రాష్ట్ర గవర్నర్ విల్సన్ విట్జెల్ కు కరోనా వైరస్ సోకింది. ఆయనకు జ్వరం రావడం కరోనా వైరస్ లక్షణాలు బయటపడటం తో ఆయనకు పరిక్షలు నిర్వహించారు. దీనితో ఆయనకు కరోనా వైరస్ ఉన్నట్టు బయటపడింది. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన చేసారు. నాకు కరోనా లక్షణాలైన జ్వరం, గొంతునొప్పి సమస్యతో బాధపడుతూ పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ అని వచ్చిందని ఆయన వివరించారు.
విల్సన్ ఓ వీడియో సందేశాన్ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. దీనితో ఆ రాష్ట్ర ప్రజల్లో కలవరం మొదలయింది. తాను సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండి తన పని చేసుకుంటూ వైద్యుల సలహా పాటిస్తూ కోలుకుంటున్నా అని ఆయన ఆ వీడియో లో పేర్కొన్నారు. బ్రెజిల్ లో కరోనా క్రమంగా పెరుగుతుంది. అక్కడ వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం ఆ దేశంలో 24 వేల మందికి కరోనా బయటపడింది.