చాలాకాలంగా మార్గదర్శికి సంబంధించిన పొరపాట్లు జరిగాయని చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న రామోజీరావు పైట కేసు నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కేసును సిఐడి డిపార్ట్మెంట్ విచారణను వేగవంతం చేసింది. ఇటీవల కూడా రామోజీరావుని ఆయన ఇంట్లోనే విచారించిన సిఐడి కీలక విషయాలను మరియు ఆధారాలను సేకరించనట్లుగా తెలిపింది. ఇక తాజాగా ఈ కేసులో దూకుడు పెంచి రామోజీరావుకు సంబంధించిన రూ. 793 కోట్ల ఆస్తులను ఛార్జ్0 షీట్ లో అటాచ్ చేసింది. దీని ద్వారా సిఐడి ఇందులో డబ్బులు కట్టిన అందరికీ ఒకటి క్లియర్ గా చెప్పింది. చిట్ పేరుతో మార్గదర్శి చిట్ ఫండ్ అనేక పొరపాట్లు మరియు మోసాలు చేసి కోట్ల డబ్బును హైద్రాబాద్ కార్పొరేట్ ఆఫీస్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టారని బట్టబయలు చేసింది.
ఇందులో డబ్బులను కట్టిన వారికి ఇప్పుడల్లా డబ్బులు ఇచ్చే పరిస్థితిలో రామోజీరావు లేదని పేర్కొంది.