BREAKING :లెజెండ్ క్రికెటర్ కన్నుమూత !

-

వరల్డ్ కప్ ఇండియాలో జరుగుతూ ఉండగా, ఇండియా క్రికెట్ టీం వరుస విజయాలతో ప్రత్యర్థులను చిత్తు చిత్తు గా ఆడిస్తూ ముందుకు దూసుకువెళుతూ ఉంది. ఇప్పటికే అయిదు మ్యాచ్ లలో గెలిచి సెమీస్ కు చాలా దగ్గరగా ఉంది. ఇండియాలోని క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లు ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్న వేళ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇండియా మాజీ లెజెండ్ క్రికెటర్ మరణించారు. ఈ విషయం క్రీడాలోకాన్ని విషాధఛాయలలో ముంచేసింది అని చెప్పాలి. ఇండియా క్రికెట్ కు దొరికిన లెజెండరీ స్పిన్నర్ మరియు మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ భేడి (77) కాసేపటి క్రితమే మరణించారు. ఇండియా తరపున ప్రాతినిధ్యం వహించిన బిషన్ సింగ్ భేడి తన కెరీర్ లో 67 టెస్ట్ మ్యాచ్ లు ఆడి 266 వికెట్లను సాధించారు.

అదే విధంగా 10 వన్ డే లను ఆడగా, ఫస్ట్ క్లాస్ లో మాత్రం 370 మ్యాచ్ లను ఆడి 1560 వికెట్లు తీయగలిగాడు. కాగా ఇతని లైఫ్ లో ఎంతోమంది యువ క్రికెటర్లను మంచి నైపుణ్యం కలిగిన ఆటగాళ్లుగా తీర్చిదిద్దంలో సక్సెస్ అయ్యాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version