బీఆర్ఎస్ కీలక నిర్ణయం.. నల్లగొండ రైతు మహాధర్నా వాయిదా!

-

నల్లగొండ బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించతలపెట్టిన రైతు మహాధర్నా ప్రోగ్రామ్‌ను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించింది.సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా రైతు మహాధర్నాను వాయిదా వేస్తున్నట్లు బీఆర్ఎస్ తెలిపింది. సంక్రాంతి తర్వాత పెద్ద ఎత్తున రైతు మహాధర్నాను నిర్వహిస్తామని గులాబీ పార్టీ ప్రకటించింది.

బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రవీందర్ కుమార్, జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ..సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణాలు, రహదారుల రద్దీ దృష్ణ్యా రైతు మహాధర్నాను వాయిదా వేశామన్నారు. పండుగ తర్వాత కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడతామన్నారు. రైతు భరోసా రూ. 15 వేల నుంచి రూ. 12 వేలకు తగ్గించారని, రూ.2 లక్షల రుణమాఫీ సగమే చేశారని గుర్తుచేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల దృష్టి మళ్లించేందుకు కేటీఆర్ మీద కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version