మరికాసేపట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ బడ్జెట్ మీద దేశ ప్రజల చాలా ఆశలు పెట్టుకున్నారు. మూడవ సారి దేశ బడ్జెట్ ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టనున్న నేపధ్యంలో సర్వత్రా ఉత్కంట నెలకొంది. కరోనాతో కుదేలైన దేశ ఆర్దిక పరిస్థితి ని చక్కబెట్టేందుకు పలు కీలక కేటాయింపులు, నిర్ణయాలు ఉంటాయని భావిస్తున్నారు. కొన్ని రంగాలు చాలా వేగంగా ఆర్ధిక పురోగతి సాధించినా, కొన్ని రంగాలలో ఇప్పటికీ ఆర్ధిక ఇబ్బందులతో సతమతమౌతున్నారు.
దీంతో పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించేలా ప్రకటనలు చేస్తారని భావిస్తున్నారు. కరోనా కారణంగా బాగా సంప్రదాయ పొదుపు చర్యలు పడిపోయాయి. దీర్ఘకాల పొదుపు పధకాల పట్ల విముఖత ను తొలగించేందుకు ప్రోత్సాహాకాలు ఉండచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆన్ లైన్ విద్య ను పెద్ద ఎత్తున ప్రోతసహించేందుకు భారీ కేటాయింపులుండవచ్చని కూడా చెబుతున్నారు.