Camera Day 2021: ఈ టిప్స్ పాటిస్తే ప్రొఫెష‌న‌ల్‌లా ఫొటోలు తీయ‌వ‌చ్చు..!

-

ఒక‌ప్పుడు కేవ‌లం ఫొటోగ్రాఫ‌ర్ల వ‌ద్దే కెమెరాలు ఉండేవి. మ‌నం ఫొటోలు కావాలంటే స్టూడియోకు వెళ్లి ఫొటోలు తీసుకునేవాళ్లం. త‌రువాత కొద్ది రోజుల‌కు ఫొటోలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. మ‌న చేతిలో ఉన్న ఫోన్ల‌తోనే అద్భుత‌మైన ఫొటోల‌ను తీసుకోగ‌లుగుతున్నాం. ఇంక ప్రింట్ కావాల‌న్నా క్ష‌ణాల్లో వాటిని తీసుకోవ‌చ్చు. అంత‌లా టెక్నాల‌జీ మారింది. కానీ చేతిలో ఫోన్ ఉన్నా.. ప్రొఫెష‌న‌ల్‌లా ఫొటోలు తీయాలంటే అందుకు కొన్ని చిట్కాలు పాటించాల్సిందే. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే..

1. స్మార్ట్ ఫోన్ల‌లోని కెమెరా యాప్‌లో గ్రిడ్ లైన్స్ పేరిట ఓ ఫీచ‌ర్ ల‌భిస్తుంది. దాన్ని ఉప‌యోగించుకోవాలి. ఆ ఫీచ‌ర్ స‌హాయంతో షాట్‌ను బ్యాలెన్స్ చేయ‌వ‌చ్చు. దీంతో ఇమేజ్ 3 పార్ట్‌లుగా విభ‌జించ‌బ‌డుతుంది. దీంతో ప‌ర్ ఫెక్ట్ షాట్ తీయ‌వ‌చ్చు.

2. ఫోన్ల‌లోని కెమెరా యాప్ ల‌లో ఆటోమేటిక్ ఫోక‌స్ ఫీచ‌ర్ ను అందిస్తున్నారు. దీంతో ఫొటోలు స్ప‌ష్టంగానే వ‌స్తాయి. కానీ ఫొటో తీసేముందు స్క్రీన్‌పై ఒక సారి ట్యాప్ చేయాలి. దీంతో ప‌ర్‌ఫెక్ట్ గా ఫొటోల‌ను తీయ‌వ‌చ్చు.

3. ఫోన్ల‌లో ఉండే ల్యాండ్ స్కేప్ మోడ్ లేదా ప‌నోర‌మా మోడ్ ద్వారా పెద్ద ఫోటోల‌ను తీయ‌వ‌చ్చు. వాటితో తీసే ఫొటోలు పెద్ద స్క్రీన్‌పై అద్భుతంగా క‌నిపిస్తాయి.

4. కేవ‌లం డిజిట‌ల్ కెమెరాతోనే కాదు, స్మార్ట్ ఫోన్ కెమెరాతోనూ భిన్న యాంగిల్స్‌లో ఫొటోలు తీయ‌వ‌చ్చు. బ‌ర్డ్స్ ఐ వ్యూ, బ‌గ్స్ ఐ వ్యూ, ఫేస్ టు ఫేస్, హై యాంగిల్‌, లో యాంగిల్ వంటి కోణాల్లో ఫోన్ల‌తో ఫోటోలు తీస్తే అద్భుతంగా వస్తాయి.

5. ఫొటో తీశాక ప‌లు ర‌కాల ఫిల్ట‌ర్ల‌ను ఉప‌యోగించి ఆ ఇమేజ్‌ల‌ను మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా చేసుకోవ‌చ్చు. అందుకు కెమెరా యాప్‌లోనే ప‌లు ఫిల్ట‌ర్లు ల‌భిస్తున్నాయి. వాటిని ఉప‌యోగించ‌వ‌చ్చు. బ్రైట్ నెస్‌, కాంట్రాస్ట్‌, శాచురేష‌న్ వంటివి అడ్జ‌స్ట్ చేస్తే ఫొటోలు బాగా క‌నిపిస్తాయి.

ప్ర‌తి ఏటా జూన్ 29వ తేదీని కెమెరా డేగా జ‌రుపుకుంటారు. మ‌రింకెందుకాలస్యం, పైన తెలిపిన టిప్స్‌తో ఫ్రొఫెష‌న‌ల్‌లా ఫొటోలు తీయండి మ‌రి.

Read more RELATED
Recommended to you

Exit mobile version