కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ వలన చాలా రకాల బెనిఫిట్స్ ని పొందడానికి అవుతుంది. ఆర్థికంగా ఎదిగేందుకు మోడీ సర్కార్ ఎన్నో స్కీమ్స్ ని తెచ్చింది. అయితే కేంద్రం తీసుకు వచ్చిన స్కీమ్స్ లో ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన పథకం ఒకటి. ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన స్కీమ్ ద్వారా బెనిఫిట్స్ ని పొందొచ్చు.
2014 ఆగస్టు 15న ఈ పథకాన్ని తీసుకు వచ్చారు. ఈ అకౌంట్ ఉంటే మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయవలసిన అవసరము లేదు. జన్ ధన్ యోజన ఖాతాలను ప్రభుత్వ పథకాలకు లింక్ చేసి లబ్ధిదారులకు నేరుగా డబ్బులు పడతాయి. బ్యాలెన్స్ లేకపోయినా మీరు ఖాతా నుంచి రూ.10,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. పైగా దీనిలో మీరు రూపే డెబిట్ కార్డ్ సౌకర్యం ని కూడా పొందొచ్చు. ఇక ఎవరు ఈ ఖాతా ని ఓపెన్ చెయ్యచ్చనేది చూస్తే…
ఈ జన్ ధన్ యోజన కింద 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలపై కూడా ఖాతాను తెరవవచ్చు. .2 లక్షల ప్రమాద బీమా, రూ.30 వేల జీవిత బీమా, డిపాజిట్ మొత్తంపై వడ్డీ వస్తుంది. అలానే ఏటీఎం కార్డు కూడా. 10 వేల ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం కూడా పొందుతారు. ఈ అకౌంట్ ని మీరు ఏ బ్యాంక్ కి వెళ్లి అయినా సరే ఓపెన్ చెయ్యచ్చు. ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లో ఏదో ఒకటి కావాలి. 10 సంవత్సరాలు లేదా అంత కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా ఈ అకౌంట్ ని ఓపెన్ చేసుకోవచ్చు.