అదిరే LIC పాలసీ.. రూ.233 తో 17 లక్షల ఆదాయం..!

-

మనకి చాలా స్కీమ్స్ అందుబాటులో వున్నాయి. LIC కూడా ఎన్నో పధకాలను తీసుకు వచ్చింది. ఇందులో అన్ని వర్గాల కోసం అనువైన పాలసీలు వున్నాయి. పైగా ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. మీరు కూడా ఏదైనా పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే తప్పకుండ జీవన్‌ లాభ్‌ గురించి చూడాలి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

LIC

ఇందులో మీరు తక్కువ మొత్తంతో ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చు. ఇది నాన్-లింక్డ్ పాలసీ. ఈ పాలసీకి షేర్ మార్కెట్‌తో ఎలాంటి సంబంధం ఉండదు అలానే ఇది సురక్షితం కూడా. పిల్లల పెళ్లిళ్లు, చదువులు, ఆస్తుల కొనుగోలు వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పరేషన్ దీనిని తీసుకొచ్చారు.

ప్రతి రోజు కేవలం రూ. 233 డిపాజిట్ చేయడం ద్వారా 17 లక్షలను పొందొచ్చు. 23 ఏళ్ల వయసులో ఉన్న ఒక వ్యక్తి 16 ఏళ్ల కాల పరిమితితో ఈ పాలసీ తీసుకుంటే రూ.10 లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకుంటే పదేళ్లు మాత్రమే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. నెలకు దాదాపు రూ.7 వేలు ప్రీమియం కట్టాలి. అంటే రోజుకు రూ.233 ఆదా చేస్తే సరిపోతుంది.

మెచ్యూరిటీ సమయంలో రూ.17 లక్షలకు పైగా వస్తాయి. అయితే ఈ పాలసీ తీసుకోవాలంటే 8 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసున్న వారు తీసుకోవచ్చు. ఈ పాలసీ టర్మ్ 16 నుంచి 25 ఏళ్లు ఉంటుంది. కనీసం రూ.2 లక్షల మొత్తానికి పాలసీ తీసుకోచ్చు. పైగా ఎలాంటి లిమిట్ కూడా లేదు. ఈ పాలసీ తీసుకున్న వినియోగదారుడు మూడు సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లింపుపై కూడా లోన్ పొందొచ్చు. ట్యాక్స్ బెనిఫిట్స్ ని కూడా పొందొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version