మనకి చాలా స్కీమ్స్ వున్నాయి. ఈ స్కీమ్స్ వలన ఎన్నో రకాల ప్రయోజనాలను మనం పొందొచ్చు. అయితే ఎల్ఐసీ కూడా స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ వలన ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. అలానే మెచ్యూరిటీపై గ్యారెంటీ రిటర్నులను కూడా ఆఫర్ చేస్తాయి. అయితే ప్రత్యేకంగా మహిళలు, ఆడపిల్లల కోసం ఎల్ఐసీ తీసుకు వస్తోంది. వాటిలో ఆధార్ శిలా కూడా ఒకటి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..
ఈ ప్లాన్ పూర్తిగా నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్ ఇన్సూరెన్ ప్లాన్. ఆటో కవర్ ద్వారా లిక్విడిటీ అవసరాలను ఈ పాలసీ తీరుస్తుంది. లోన్ సౌకర్యం కూడా ఈ పాలసీ ద్వారా పొందొచ్చు. ఎలాంటి మెడికల్ పరీక్షలు లేకుండానే ఆరోగ్యవంతులైన మహిళలకు ఈ పాలసీని ఆఫర్ చేస్తోంది. ఈ పాలసీ కింద రోజుకు రూ.29 ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో రూ.4 లక్షల వరకు పొందవచ్చు.
ఆధార్ శిలా ప్లాన్ మినిమమ్ బేసిక్ సమ్ అస్యూర్డ్ ఒక్కో వ్యక్తికి రూ.75 వేలుగా ఉంటోంది. అలానే మ్యాగ్జిమమ్ బేసిక్ సమ్ అస్యూర్డ్ రూ.3 లక్షలు దాటదు. ఈ పాలసీ కింద గరిష్టంగా రూ.3 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ పాలసీ మెచ్యూరిటీ కాల వ్యవధి 10 నుంచి 20 ఏళ్లు ఉంటుంది. ప్రీమియాన్ని నెలకి, మూడు నెలలకు ఒకసారి, ఆరు నెలలకు ఒకసారి, వార్షికంగా చెల్లించుకోవచ్చు.
ఇక డబ్బులు ఎలా వస్తాయి అనేది చూస్తే.. ఎల్ఐసీ ఆధార్ శిలా ప్లాన్‌లో ఒకవేళ రోజుకు రూ.29 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి రూ.10,959 అవుతుంది. ఒకవేళ 20 ఏళ్లకు మీరు పాలసీ తీసుకుంటే ఈ పాలసీ టర్మ్‌లో మీరు చెల్లించిన మొత్తం రూ.2,14,696 అవుతుంది. అప్పుడు మెచ్యూరిటీ సమయంలో రూ.4 లక్షల వరకు చేతికి వస్తాయి. ఈ పాలసీని కేవలం మహిళలకు, ఆడపిల్లలకు మాత్రమే. 8 నుంచి 55 ఏళ్ల మధ్య వయసు కలిగిన మహిళలు, పిల్లలు ఎవరైనా ఈ పాలసీ తీసుకోచ్చు.