హైదరాబాద్ నగరంలోని లిబర్టీ వద్ద జీహెచ్‌ఎంసీ కార్యాలయంపై నిన్న భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆ కార్యాలయంలోని… ఫర్నీచర్స్, టేబుల్స్ ధ్వంసం చేశారు బీజేపీ కార్పొరేటర్లు. అయితే…. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసుకున్నారు. ఏకంగా.. 32 మంది బీజేపీ కార్పొరేటర్లపై కేసు నమోదు చేశారు పోలీసులు.
జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేశారు పోలీసులు. జీహెచ్‌ఎంసీ ఆఫీసులో హంగామ చేశారు బీజేపీ కార్పొరేటర్లు. రాంనగర్, ముసరాంబాగ్, బేగంబజార్, ఆర్కేపురం, ఘన్‌ఫౌండ్రి.. మాల్కాజ్‌గిరి కార్పొరేటర్లు ప్రధాన ఘటనకు బాధ్యులుగా గుర్తించారు పోలీసులు. అలాగే… జీహెచ్‌ఎంసీ లో సీసీ ఫుటేజ్ సేకరించారు సైఫాబాద్ పోలీసులు. ఈ నేపథ్యంలోనే వారిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇక జీహెచ్‌ఎంసీలో జరిగిన సంఘటనపై కేటీఆర్ ట్వీట్ చేశారు. ఘటనకు బాధ్యులైనవారి పై చర్యలు తీసుకోవాలని సీపీకి సూచనలు చేశారు.ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటేనే… మళ్లీ ఘటనలు పునరావృతం కావని తెలిపారు.