కరోనా నేపథ్యంలో సాధారణ మృతి సైతం ప్రజల్లో కలవరం సృష్టిస్తుంది. సహజ మరణం అయినా చనిపోయిన మృతదేహన్ని చూడడానికి అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా కుటుంబసభ్యులు, బంధువులు ఎవరూ ల్ప్ప్డా ముందుకు రావడంలేదు. అందరు ఉన్నా అనాథ శవాలుగా కడసారి వీడ్కోలకు దూరమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ సభ్యులు అంత్యక్రియలు చేయడానికి ముందుకు వస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఈ సంస్థకు సభ్యులు ఉన్నారు.
తాజాగా కోవిడ్ లక్షణాలు ఉండి జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందగా అక్కడి పాపులర్ ఫ్రాంట్ ఆఫ్ ఇండియా కార్యకర్తలు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే అభినందించాల్సింది పోయి, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి అంత్యక్రియలు చేశారని పాపులర్ ఫ్రాంట్ ఆఫ్ ఇండియా కు చెందిన ముగ్గురు కార్యకర్తలపై జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. నిజానికి కరోనతో మృతి చెందిన వారిని ఖననం చేయడానికి ఒక ప్రోటోకాల్ ఉంది. మరి ఇక్కడ అతను లక్షణాలతో చనిపోగా అంత్యక్రియలు చేశారు. కేసు ఎందుకు నమోదు చేశారనే విషయం తెలియాల్సి ఉంది.