కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, సోదరుడి ఇళ్ళ మీద సీబీఐ రైడ్స్ !

-

శివ కుమార్ మీద నమోదయిన అవినీతి కేసులకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డికె శివకుమార్ ఇంట్లో ఈరోజు ఉదయం దాడులు నిర్వహించింది. అతని సోదరుడు డికె సురేష్ ఇంటిని కూడా శోధిస్తున్నారు.

ఇక ఈ దాడులపై స్పందిస్తూ కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సింగ్ సుర్జేవాలా “మోడీ & యడ్యూరప్ప ప్రభుత్వాలు & బిజెపి యొక్క ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అంటే సిబిఐ-ఇడి-ఆదాయపు పన్ను తెలుసు, కాంగ్రెస్ కార్యకర్తలు & నాయకులు అలాంటి వంచన ప్రయత్నాలకు ముందు వంగిపోరు లేదా నమస్కరించరు” అని ట్వీట్ చేశారు. అలానే ఈ దాడుల మీద కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా స్పందించారు. బీజేపీ ఎప్పుడూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందన్న ఆయన రానున్న ఉప ఎన్నికల విషయంలో ప్రజల ద్రుష్టిని మరల్చడానికి ఈ రైడ్స్ చేస్తున్నారని ఆయన విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version