జగన్ సర్కార్ కి షాక్ ఇచ్చిన కేంద్రం…!

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ), అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) షాక్ ఇచ్చాయి. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు ప్రతీ ఏటా లక్షన్నర మంది విద్యార్ధులు డిగ్రీ పూర్తి చేసుకుని బయటకు వెళ్తున్నారని, వారు అందరిలో దాదాపు 5 వేల నుంచి 10 వేల మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయని భావించిన రాష్ట్ర ప్రభుత్వం విద్యా కాలపరిమితిని పెంచాలని భావించింది.

డిగ్రీ నాలుగేళ్ళు, ఇంజనీరింగ్ అయిదేళ్ళు చేసి… కచ్చితంగా ఉద్యోగం రావాలి అంటే ప్రాక్టికల్స్ ఉండాలని ముఖ్యమంత్రి జగన్ గత ఏడాది డిసెంబర్ లో ప్రకటించారు. దీనిపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ విధానాన్ని వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రవేశపెట్టాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ విధానం కోసం అనుమతి కోరుతూ యూజీసీ, ఏఐసీటీఈలకు ఉన్నత విద్యామండలి ఒక లేఖ రాసింది.

ఢిల్లీ వెళ్లిన మండలి అధికారులకు యూజీసీ, ఏఐసీటీఈ ఉన్నతాధికారులు ఆయా కోర్సుల్లో ఎలాంటి మార్పులూ చేయడానికి వీల్లేదని, జాతీయ విద్యా విధానానికి లోబడి కోర్సుల కాల వ్యవధి ఉండాలని, సాధారణ కోర్సులా, ఆనర్స్‌ కోర్సులా అనే దానికి వేర్వేరు ఆప్షన్లు ఉంటాయని తేల్చి చెప్పింది. ప్రస్తుతం డిగ్రీ మూడేళ్ళు ఉండగా ఇంజనీరింగ్ నాలుగేళ్ళు ఉంది. గత ఏడాది జగన్ చేసిన ప్రకటనతో,

కొత్త విద్యా విధానం అమలులోకి వస్తుంది అని భావించారు. కాని అనుమతి రాకపోవడంతో పాత విద్యా విధానమే అమలులో ఉంటుంది. వాస్తవానికి జగన్ సర్కార్ ఈ విద్యా విధానాన్ని వచ్చే ఏడాది నుంచి ప్రవేశపెట్టాలని చూసింది. జాతీయ విద్యా విధానానికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం తమ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోరాదని స్పష్టం చేశాయి. కోర్సుల కాల వ్యవధి ఎలా ఉండాలన్నది రాష్ట్రాలకు సూచిస్తామని యుజీసి పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version