దేశంలో ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే 3000కు పైబడి కేసులు నమోదయ్యాయి. ఇందులో మెజారిటీ కేసులు ఇతర దేశాల నుంచి భారత్ కు రావడంతోనే వెలుగులోకి వచ్చాయి. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్నేషనల్ ప్రయాణికులకు కొత్త క్వారంటైన్ రూల్స్ విధించింది. ఇతర దేశాల నుంచి ఇండియాకు వచ్చేవారు.. ఇక్కడకు వచ్చిన తర్వాత తప్పనిసరిగా 7 రోజులు క్వారంటైన్ లో ఉండాల్సిందే అని ఆదేశించింది కేంద్రం. ఏడు రోజుల అనంతరం 8వ రోజు తప్పని సరిగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని సూచించింది.
ఓమిక్రాన్ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం… ఇంటర్నేషనల్ ప్రయాణికులకు కొత్త క్వారంటైన్ రూల్స్
-