వ్యాక్సిన్ వచ్చేస్తోంది.. పేరు నమోదు చేసుకున్నారా… ఈ విషయాలు తెలుసుకోండి.

-

వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న జనాలకి శుభవార్త అందింది. మహమ్మారిని తరిమి కొట్టడానికి వైద్య శాస్త్రజ్ఞులు చేసిన ప్రయత్నం తుది దశకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుండి సమాచారం బయటకు వచ్చేసింది. పౌరులందరూ టీకా వేయించుకోవాలని అందుకు కావాల్సిన మార్గదర్శకాలని బయటపెట్టింది. కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలనుకునే వారు ముందుగా రిజిస్టర్ చేయించుకోవాలనీ, ప్రతీ ఒక్కరూ టీకా వేయించుకోవచ్చని తెలిపింది.

ఇండియాలో వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్, సీరమ్ కంపెనీల ప్రయత్నాలు చివరి దశలో ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేస్తోంది. అయితే వ్యాక్సిన్ ఎలా వేయించుకోవాలీ, ముందుగా ఎవరికి వేస్తారు, దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటనేది ప్రభుత్వం ప్రకటించింది. దాని ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 25వ తేదీలోగా వ్యాక్సిన్ వేసే విషయమై తీసుకునే చర్యల గురించి ప్లానింగ్ చేసుకోమని తెలిపింది.

ఐతే వ్యాక్సిన్ వేయించుకోవాలనుకునే వారు ముందుగా పేరు నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్నాక ఆ వ్యక్తికి మెసేజ్ వస్తుంది. వ్యాక్సిన్ ఎప్పుడు వేస్తారనే విషయం మొబైల్ నంబరుకి చేరిపోతుంది. వ్యాక్సిన్ వేసుకున్న 28రోజుల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందట. అప్పట్లోగా రెండు సార్లు టీకా వేయించుకోవాలి. ముందుగా వైద్య సిబ్బంది, పోలీసులు, మొదలగు వారందరికీ కరోనా టీకా ఇస్తారట. ఆ తర్వాత పేరు నమోదు చేయించుకున్న వారికి టీకా వేస్తారు.

ఐతే ఎప్పటి నుండి వ్యాక్సిన్ అందుబాటులో ఉండనుందనే విషయం ఇంకా వెల్లడి చేయలేదు. కరోనా కారణంగా స్తంభించిపోయిన ప్రపంచం ఇప్పుడిప్పుడే కదలడం ప్రారంభించింది. మరి వ్యాక్సిన్ వచ్చేసి, ఆ కదలికని మరింత వేగం చేస్తే బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version