కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఉద్యోగులకు డీఏ పెంపుపై అవకాశం

-

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త వినిపించనుంది. త్వరలో డీఏ పెంచేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ గుడ్‌న్యూస్‌ను హోళి పండుగకు ముందే ప్రకటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం 17 శాతం డీఏను అందిస్తోంది. తాజా ప్రకటన అమలు అయితే 28 శాతానికి చేరుతుంది. ఈ ప్రతిపాదన అమలు అయితే జూలై నెల నుంచే డీఏ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

money

డీఏ పెరిగితే ట్రావెల్ అలవెన్స్ (టీఏ) పెరిగే అవకాశం కూడా అదే స్థాయిలో ఉంది. దీంతోపాటు పీఎఫ్ బ్యాలెన్స్ కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నారు. డీఏ, పీఎఫ్, టీఏలు పెరిగితే ప్రభుత్వ ఉద్యోగులకు మరింత మేలు జరగనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మరికొద్ది రోజులు వేచి చూడాలి. కాగా, జూలై 1వ తేదీ నుంచి డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) బెనిఫిట్స్ పొందే అవకాశాలు కనిపిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

డీఏ బెనిఫిట్స్, పెన్షనర్ల బకాయిల చెల్లింపు కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు ఏడవ వేత సంఘం కీలక ప్రతిపాదనలు చేసింది. దీనిపై కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇటీవల పార్లమెంట్‌లో ప్రస్తావించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం జూలై 1వ తేదీ నుంచి డీఏ బెనిఫిట్స్ పొందనున్నారు.

డియర్‌నెస్ (డీఏ), డీఆర్ బెనిఫిట్స్ కేంద్ర ప్రభుత్వం మూడు వాయిదాలుగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. గతేడాది నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ బెనిఫిట్స్ కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ కారణంగా నిలిపివేశారు. గతేడాదే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంచుతామని చెప్పారు. కానీ అది అమలు చేయలేదు. కొత్త డీఏ, పాత డీఏలను కేంద్ర ఒకేసారి కల్పిస్తే ఏకంగా 28 శాతం డీఏను పొందుతారు. ఈ బెనిఫిట్స్ 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 65 లక్షల మంది పెన్షనర్లకు ఉపయోగపడనుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు, పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version