వాళ్ళపై క్రిమినల్ కేసులకు రెడీ అయిన కేంద్రం…!

-

ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్ళిన వాళ్ళు కొందరు చేసిన పనులు ఇప్పుడు తీవ్ర విమర్శల వేదికగా మారాయి. ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద తిరిగారు వాళ్ళు. తెలిసి కూడా తిరగడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఒక పక్క మీరు వచ్చి లొంగిపోవాలి అని ప్రభుత్వాలు కోరుతున్నా సరే కొందరు దాక్కున్నారు ఇళ్ళల్లో. బయటకు చెప్పలేదు… వారి కారణంగా ఇంట్లో వాళ్ళు కూడా నాశనం అయ్యారు.

కొంత మంది ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. ఆంధ్రప్రదేశ్ లో 17 మందికి కరోనా రాగా మహారాష్ట్ర, కర్ణాటకలో కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయింది వారే అని కూడా అధికారులు గుర్తించారు. కాశ్మీర్ లో ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిలో 37 మందికి కరోనా వైరస్ సోకింది. దీనిపై ఇప్పుడు కేంద్రం అనుమానాలు వ్యక్తం చేస్తుంది. కొంత మంది కావాలి అనే ఈ పని చేసారా…? అమాయకులను ఢిల్లీ పిలిచి బలి చేసారా అనే అనుమానాలు కేంద్ర హోం శాఖ వ్యక్తం చేస్తుంది.

మత ప్రార్ధనలకు వెళ్ళిన అమాయకుల లక్ష్యంగా ఏమైనా కుట్ర జరిగిందా అనే దాని మీద కేంద్రం ఆరా తీస్తుంది. ఇప్పుడు వారి విషయంలో తెలంగాణా కూడా సీరియస్ గా ఉంది. తెలంగాణా ప్రభుత్వం వారిని గుర్తించే పనిలో పడింది. వారి మీద ఇప్పుడు కేంద్ర హోం శాఖతో పాటుగా రాష్ట్రాలు కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని భావిస్తున్నాయి. టూరిస్ట్ వీసాలతో ఇండోనేషియా నుంచి వచ్చిన 800 మంది నిజాముద్దీన్ మత ప్రార్థనల్లో పాల్గొన్నట్టు కేంద్ర హోంశాఖ గుర్తించింది. వారంతా వీసా నిబంధనలు ఉల్లంఘించారని ప్రకటించింది. వీరిపై కఠిన చర్యలు తీసుకునే విషయంపై కేంద్ర హోంశాఖ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version