TTDకి షాక్..చాగంటి కోటేశ్వరరావు సంచలన ప్రకటన

-

TTDకి షాక్. టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారు పదవి తనకు వద్దని ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వర రావు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతుంది. చాగంటిని జనవరి 20 న హిందూ ధర్మప్రచార పరిషత్తు కార్యనిర్వాహక కమిటీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మాట్లాడిన ఓ వీడియో శనివారం వెలుగులోకి వచ్చింది.

అందులో ‘ధర్మప్రచార పరిషత్తులోని సభ్యులు, అధ్యక్షులు, ఈవోకు విశేషమైన అనుభవం ఉంది. వారి సలహాల అవసరం ఉండదు. ఒకవేళ ఏ విషయంలోనైనా అనుమానం వచ్చి అడిగితే చెప్పే శక్తి నాకు ఉండాలి. దానికి పదవే ఎందుకు? పదవి ఇస్తే చేస్తానని ఎందుకు అనుకున్నారు?నా ఊపిరి స్వామి సేవకు పనికివస్తే జీవితం ధన్యం. పదవిని స్వీకరించలేను. నాకు ఏ పదవి వద్దు. ఈ పని చేసి పెట్టు అని తితిదే అడిగితే నాకు అవకాశం ఉంటే పరుగున వెళ్లి చేస్తా’ అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version