మీ అమ్మాయి పెళ్లికి రూ.71 లక్షలు పొందే అవకాశం.. నిజమా?

-

మీకు అమ్మాయి పుట్టిందా? అయితే ఎలా పెంచాలి, పోషించాలి అనే దాని గురించి దిగులు పడకండి.. అమ్మాయిల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్ లను, పథకాలను అమలు చేస్తుంది..ఇప్పటికే ఎన్నో కొత్త స్కీమ్ లను అందుబాటులోకి తీసుకొని వచ్చింది.అమ్మాయిల ఉనికిని పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలను తీసుకుంటూ వస్తున్నారు. ఈ మేరకు బేటీ బచావో బేటీ పడావో పాలసిని అమలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.

ఈ పథకంలో అమ్మాయి పుట్టిన నాటి నుంచి కొంత మొత్తాన్ని అమ్మాయి పేరు మీద కడుతూ వస్తే అవి అమ్మాయి చదువుకు, పెళ్ళికి సర్దుబాటు అవుతాయని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ఇందులో భాగంగా సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని తీసుకొచ్చింది. అమ్మాయి పేరు మీద నెలకు 250 రూపాయలు కడితే 10 సంవత్సరాల లోపు అది వడ్డీ పెరిగి 1 లక్షా, 50 వేలు అవుతుంది. అదే 15 సంవత్సరాలు డిపాజిట్ చేస్తే అమ్మాయికి 21 సంవత్సరం వచ్చాక డబ్బులు మొత్తం తీసుకోవచ్చు.అలాగే నెలకు 12,500 ఆపైన కడితే అమ్మాయికి 21 సంవత్సరం వచ్చే సరికి అది 71 లక్షలు అవుతుంది. దీనిపై పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. మీకు స్కీమ్ లో చేరే ఆలోచన ఉంటే పోస్టాఫీసు, బ్యాంక్ లలో అమ్మాయి పేరు మీద ఖాతా ఓపెన్ చేసి స్కీమ్ లో చేరవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version