బ్రేకింగ్‌ : వరద బాధితులకు రూ.లక్ష పరిహారం ప్రకటించిన చంద్రబాబు

-

భారీ వర్షాల నేపథ్యంలో.. ప్రజలను ఆదుకోవడంలో… జగన్‌ సర్కార్‌ పూర్తి గా విఫలమైందని చంద్రబాబు ఫైర్‌ అయ్యారు. భారీ వర్షాలకు నష్ట పోయిన బాధిత కుటుంబాలకు తెలుగు దేశం పార్టీ తరఫున రూ. లక్ష పరిహారాన్ని ఇస్తున్నట్లు చెప్పారు. వరద వస్తుందని హెచ్చరికలు వస్తున్నా ప్రభుత్వం అలసత్వాన్ని పదర్శించిందని… పింఛా ప్రాజెక్టు తెగడం వల్ల అన్నమయ్య ప్రాజెక్టుపై ఒత్తిడి పెరిగిందన్నారు.

ఈ ప్రభుత్వ తీరు వల్ల గతేడాది కూడా ఫించా ప్రాజెక్టు తెగిందని… ప్రాజెక్టు నిర్వహణలో అలసత్వంగా ప్రదర్శించి ప్రజల ప్రాణాలు తీశారని వెల్లడించారు.  ఇవి ప్రభుత్వ హత్యలేనని… ప్రజలను కాపడవలసిన వారే చంపే వరకు వచ్చారని ఫైర్ అయ్యారు. ఎల్జీ పాలిమర్స్ లొ చనిపొయిన వారికి కోటీ రూపాయలు ఇచ్చారని… ఇక్కడ మాత్రం ఐదు లక్షలు మాత్రం ఇచ్చారని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ సిఎం నిర్లక్ష్యం వల్ల ప్రజలు ప్రాణాలు కొల్పొయారని మండి పడ్డారు. కాపాడగలిగిన ప్రభుత్వం కాపాడలేకపొయిందన్నారు. మా వాలెంటీర్లు చక్కగా పనిచేశారని అంటున్నారని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version