ఏపీలో కరెంట్ చార్జీల పెంపునకు నిరసనగా వైసీపీ నేతలు ఆందోళన బాటపట్టారు. వెంటనే కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోవాలని ఆ పార్టీకి చెందిన కీలక నేతలు రోడ్డెక్కి ఆందోలన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పిలుపుమేరకు ఆ పార్టీ శ్రేణులు నిరసనలు చేపడుతున్నాయి.
ఈ క్రమంలోనే పెంచిన కరెంట్ చార్జీలను తక్షణమే తగ్గించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేయగా.. చంద్రబాబు మాయమాటలతో ప్రజలను మోసం చేశారని ఎంపీ మిథున్ రెడ్డి దుయ్యబట్టారు. బాబు ష్యూరిటీ బాదుడు గ్యారెంటీ అని మాజీ మంత్రి రోజా ఎద్దేవా చేశారు. గ్యారెంటీలు అంటూ చంద్రబాబు అబద్దాలు చెప్పేవారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు.