2019లో గెలిచి ఉంటే. రాష్ట్రం పరిస్థితి మరోలా ఉండేలా: చంద్రబాబు

-

వైసీపీ నేతలు చిల్లర, చెత్త, పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారని మహానాడులో చంద్రబాబు మండిపడ్డారు. ‘మహానాడును చెడగొట్టేందుకు ఫ్లెక్సీలు కట్టారు. రాజకీయాలను వ్యాపారం చేసి దోచుకున్నారు. నాసిరకం మద్యంతో తెచ్చి ప్రజలను దోచుకుంటున్నారు. అసమర్థ, విధ్వంస పాలన వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గింది. 2019లో TDP గెలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. నాలుగేళ్లలో తెలంగాణ ఆదాయం ఏపీ కంటే బాగా పెరిగింది’ అని అన్నారు.

అంతేకాకుండా నాలుగేళ్లుగా ఒక్క రైతును కూడా సీఎం జగన్ పరామర్శించలేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన టీడీపీ మహానాడులో చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై విమర్శలు చేశారు. సీఎం జగన్ అన్నదాతలను పట్టించుకోలేదని, కనీసం ధాన్యం కూడా కొనుగోళ్లు చేయలేదని తెలిపారు. తాను పోరాటం చేయడం వల్లే రాత్రి రాత్రికి ధాన్యం కొనుగోలు చేశారని చెప్పారు. ఈ ప్రభుత్వం రైతులు పూర్తిగా దగా చేసిందన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version