అదేజరిగితే.. బాబు పాతాళానికే.. కన్ ఫాం!

-

ప్రస్తుతం ఏపీలో “మూడురాజధానులు – అమారావతి మాత్రమే రాజధాని” అనే అంశంపై రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. తప్పొప్పుల సంగతి పక్కనపెట్టిన చంద్రబాబు.. ఎత్తుకు పైఎత్తులు ఎలా అన్నదిశగా మాత్రమే ఆలోచిస్తున్నారు! అందులో భాగంగా గత ఎన్నికలు అమరావతిలోనే రాజధాని అంశంపై జరిగినట్లుగా… అసెంబ్లీని రద్దుచేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని సూచిస్తున్నారు.. సవాల్ చేస్తున్నారు! అంతవరకూ బాగానే ఉంది కానీ… ఇక్కడ బాబుకు ఒక విషయం అర్ధంకావడంలేదు అనేది విశ్లేషకుల మాటగా ఉంది!

2019 ఎన్నికలు అనేవి… అమారవతిలోనే రాజధాని ఉండాలనే అంశమే ప్రాతిపధికగా జరగలేదు! గత ఎన్నికల సమయంలో అమరావతిపేరు చెప్పిన బాబు చేసిన మోసాలు, తిరిగి ప్రత్యేక విమాన ప్రయాణాలు, కట్టిన టెంపరరీ కట్టడాలు, రుణమాఫీలో చేసిన దగా, నిరుద్యోగభృతిలో చేసిన మోసం, ఇసుకపేరుచెప్పి చేసిన దందా, కానుకల పేరుచెప్పి చేసిన కక్కుర్తి పనులు, పెట్రేగిపోయిన దౌర్జన్యాలు, అవినీతి అక్రమాలు… జగన్ రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేయలగడనే నమ్మక… అంతకంటే ఎక్కువగా బాబుని ఇంక భరించలేమనే స్పష్టత…. ఇవే కీలకంగా మారి, ఎన్నికలు జరిగాయి!

ఎందుకంటే… గత ఎన్నికల సమయానికి ప్రజలకు.. వారు పడుతున్న ఇబ్బందులు, జరుగుతున్న అక్రమాలు, అవినీతిపై విసిగిపోయి ఉన్నారు. ఫలితంగా చంద్రబాబుపై పూర్తి కక్ష, కోపం అన్నీ తీర్చేసుకున్నారు! అనంతరం జగన్ తనదైన శైలిలో సంక్షేమ పథకాలు అమలుపరుస్తూ… అన్ని ప్రాంతాల అభివృద్ధి తన భాధ్యత అని, కేవలం తన సామాజిక వర్గాల వారు మాత్రం బాగుపడాలనే స్వార్ధ మనస్థత్వం లేకుండా… అమరావతిని అక్కడ ఉంచుతూనే, విశాఖ, కర్నూలు ప్రాంతాలకు కూడా అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు!

ఇది జగన్ చేసిన నేరంగా చూస్తే ఎలా? ఉత్తరాంధ్ర ప్రాతం అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది అనేది ఇంతకాలం పాలించిన నేతలే నిస్సిగ్గుగా వారి ఫెయిల్య్యూర్ ని ఒప్పుకునే పరిస్థితి. సీమది కూడా సేం ప్రాంబ్లం! మరి ఈ పరిస్థితుల్లో ఆ ప్రాంతాల అభివృద్ధి కూడా చాలా ముఖ్యమని భావించిన జగన్ ది తప్పు ఎల అవుతుంది? కేవలం తన సామాజికవర్గం వారు ఎక్కువగా ఉన్న కృష్ణా – గుంటూరు ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చెందాలని భావించి, మిగిలిన 11 జిల్లల ప్రజలకు మోసం చేసినవారిది కదా నేరం.. మోసం.. పాపం?

అదే బాబు జెండా.. అదే చంద్రబాబు అజెండా అయితే… మిగిలిన 11 జిల్లాల ప్రజలు, రెండు ప్రాంతాల ప్రజలు చేసిన నేరమేమిటీ చంద్రబాబు అని ఈ సందర్భంగా వారు ప్రశ్నిస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో 52 అసెంబ్లీ స్థానాలు ఉంటే… 2 మాత్రమే టీడీపీకి ఇచ్చారనా? ఉత్తరాంధ్రలో బాబుకు గూబలు వాచేలా ఫలితాలొచ్చాయనా? అదే ప్రజలు చేసిన తప్పైతే… అందుకే బాబుకు ఆ ప్రాంత ప్రజలపైన కక్ష అయితే… గుంటూరు – కృష్ణా జిల్లాల్లో బాబుకు ఒరిగిందేమిటీ.. సాధించేసింది ఏమిటి? అక్కడ క్లీన్ స్వీప్ లేమీ జరగలేదుగా?? బాబుకు ఇప్పటికైనా అర్ధం కావాలి? ఇప్పుడు అసెంబ్లీ రద్దై మళ్లీ ఎన్నికలొస్తే… ఉత్తరాంధ్ర, సీమ ప్రాంతాల్లో బాబు మరింత పాతాళానికి వెళ్తారు అనేది విశ్లేషకుల మాటగా ఉంది!

Read more RELATED
Recommended to you

Exit mobile version