ఈ రోజు ఉదయం టీటీడీ ఓ ఎస్డీ డాలర్ శేషాద్రి గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా ఆయన మరణంపై తాజాగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం ప్రకటించారు. శేషాద్రి మరణం టీటీడీకి తీరని లోటు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అనునిత్యం శేషాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవలో తరించారని అన్నారు. అయన టీటీడీకి ఎంతో సేవ చేశారని చెప్పారు. శేషాద్రి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానంటూ చంద్రబాబు ఎమోషనల్ అయ్యారు.
అంతే కాకుండా శేషాద్రి మృతి పట్ల టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ……శేషాద్రి మరణం తీరని లోటు అన్నారు. ఆయన 1978 నుండి శ్రీవారి సేవలో తరించిన వ్యక్తి అని చెప్పారు. శ్రీవారికి సేవచేయడమే ఊపిరిగా బ్రతికిన వ్యక్తి అంటూ వ్యాఖ్యానించారు. శేషాద్రి అర్చకులకు, అధికారులకు పెద్ద దిక్కుగా వ్యవహరించారని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని ప్రార్థిస్తున్నానంటూ పేర్కొన్నారు.