జగన్ నెత్తిన పాలు పోసిన చంద్రబాబు ??

-

టీడీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు పరిస్థితి రోజు రోజుకూ దిగజారి పోతుంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నడూ లేని విధంగా ఎప్పుడూ లేని విధంగా ఇటీవల అమరావతి రాజధాని విషయంలో ఎన్నికలు జరిపించి అమరావతి రాజధాని సబ్జెక్టుని రెఫరెండం గా తీసుకొని ఎన్నికలు ఎదుర్కొని జగన్ గెలవాలని అప్పుడు తను పూర్తిగా రాజకీయాల నుండి తప్పుకుంటానని చంద్రబాబు ఇటీవల వ్యాఖ్యలు చేయడం జరిగింది.

అయితే ఈ విషయంలో కొంతమంది సీనియర్ రాజకీయ నేతలు రాజకీయ విశ్లేషకులు నిజంగా చంద్రబాబు అమరావతి ప్రాంతంలోనే రాజధాని ఉండాలనుకుంటే చంద్రబాబు నిర్ణయానికి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్లు ఓకే చెప్పినట్లు అయితే 2019 ఎన్నికల్లో రాజధాని ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడిపోయింది అని చాలామంది రాజకీయ మేధావులు ప్రశ్నిస్తున్నారు.

 

కేవలం చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వాళ్లు మాత్రమే ఆందోళనలు చేస్తున్నారని వికేంద్రీకరణ పేరిట జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరగాలని మూడు ప్రాంతాలలో రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పిన విషయం పై రాష్ట్రంలో అన్ని చోట్ల మంచి ఆదరణ లభిస్తోందని…ఇటువంటి నేపథ్యంలో చంద్రబాబు మళ్లీ ఎన్నికలు అంటూ మాట్లాడటం హాస్యాస్పదం అని ఎట్టకేలకు తాను రాజకీయాల నుండి వెళ్ళిపోతే రాష్ట్రం బాగుంటుంది అని చంద్రబాబు గుర్తించినట్లు ఉందని…దానికి అనవసరంగా ఎన్నికలు అవన్నీ ఎందుకు మామూలుగానే రాజకీయాలకు చంద్రబాబు గుడ్ బై చెబితే ప్రకృతి తో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా ఆనందిస్తారని జగన్ నెత్తిపై పాలు పోసినట్లు అవుతుంది అంటూ కొంతమంది వైసిపి పార్టీ నేతలు రాజీనామా అంటూ ఎన్నికలు అంటే చంద్రబాబు చేసిన చాలెంజ్ పై కామెంట్ చేస్తున్నారు.  

Read more RELATED
Recommended to you

Exit mobile version