గుడ్ న్యూస్ : స్పుత్నిక్ బూస్టర్ తో ఒమిక్రాన్ కు చెక్

-

దక్షిణాఫ్రికా దేశంలో… ఒమై క్రాన్ అనే కొత్త వేరియంట్ పురుడు పోసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ కొత్త వేరియంట్.. క్రమ క్రమంగా అన్ని దేశాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ వేరియంట్ ప్రపంచంలోని 75 దేశాలకు పైగా విస్తరించిందని వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. లక్షణాలు ఏమీ కనిపించకపోవడంతో తొందరగా ఈ వేరియంట్ వ్యాపిస్తోంది.

ఇక మన ఇండియాలోనూ ఈ వేరియంట్ కేసులు సెంచరీ దాటేశాయి. ఈ నేపథ్యంలో రష్యా  శుభ వార్త చెప్పింది. స్పు త్నిక్.. రెండు డోసులకు తోడు… స్పు త్నిక్ లైట్ ను బూస్టర్ డోసు గా తీసుకుంటే కరోనా ఓ‌మి క్రాన్ వేరియంట్ ను ఎదుర్కోవచ్చని రష్యా ప్రకటించింది. స్పు త్నిక్ లైట్ బూస్టర్ తీసుకున్న వారందరిలో రెండు నుంచి మూడు నెలల్లో యాంటీబాడీలు బాగా అభివృద్ధి చెందాయని స్పష్టం చేసింది రష్యా. ఇక నుంచి ప్రతి ఒక్కరు స్పు త్నిక్ బూస్టర్ ను వేసుకుంటే చాలా మంచిదని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version