పిల్లలు నిజాయితీగా ఉండాలి అంటే తల్లిదండ్రులు ఏం చేయాలి..?

-

సాధారణంగా చిన్న పిల్లలు అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అవి అలవాటు అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. నిజాయితీ అనేది చాలా మంచి లక్షణం. మీ పిల్లల్ని కూడా నిజాయితీగా పెంచాలనుకుంటున్నారా…? అయితే ఈ పద్ధతిని చూసి చిన్నప్పటి నుంచి వీటిని అలవాటు చేయండి. దీనితో వాళ్ళు పెద్ద అయినా ఎంతో నిజాయితీగా ఉంటారు.

నిజాలనే ప్రశంసించడం:

సాధారణంగా మనం పిల్లల్ని తిట్టడం లేదా తప్పులని సరి చేయటం చేస్తూ ఉంటాం. అయితే ఎప్పుడు అయితే వాళ్లు నిజాయితీగా మాట్లాడుతున్నారో అలాంటప్పుడు వాళ్ళని అధికంగా ప్రశ్నించండి వల్ల వాళ్లలో పాజిటివ్ బిహేవియర్ అలవాటవుతుంది. అలానే వాళ్ళ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.

నిజాయితీగా మాట్లాడండి:

పిల్లలు చాలా విషయాలు తల్లిదండ్రులని చూసి నేర్చుకుంటారు. కొన్ని కొన్ని సార్లు వాటిని తల్లిదండ్రులు చూసి ఫాలో అయిపోతూ ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు ఏమైతే చేస్తున్నారో పిల్లలు కూడా వాటినే తిరిగి చెయ్యడానికి ట్రై చేస్తారు. కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా నిజాయితీగా మాట్లాడడం, నిజాలనే చెప్పడం చేస్తూ ఉంటే పిల్లలు కూడా చూసి అనుసరిస్తూ ఉంటారు.

తప్పుల్ని సరి చేయడం:

పిల్లలు ఎప్పుడైనా అబద్ధాలు ఆడితే తల్లిదండ్రులు అప్పుడు అబద్ధమని చెప్పాలి. వాళ్ళు నిజాయితీగా లేనప్పుడు దాని వల్ల కలిగే అనర్ధాలు కోసం వాళ్ళతో చర్చించండి. అబద్ధం వల్ల బంధం ఎలా తెగిపోతుంది, నమ్మకం ఎలా కోల్పోతాము వంటి విషయాలని వాళ్లతో మాట్లాడితే వాళ్లు తిరిగి ఆ తప్పులు చేయడానికి వీలు ఉండదు.

నిజాయితీగా ఉండే వాళ్ళతో స్నేహం చేయడం:

ఎప్పుడైనా సరే సక్రమంగా, పర్ఫెక్ట్ గా ఉన్న స్నేహితులతో స్నేహం చేస్తే మంచి లక్షణాలు అలవాటు అవుతాయి. అదే అబద్ధాలు ఆడటం, మోసం చేయడం వంటి వాళ్ళతో స్నేహం చేస్తే ఆ అలవాట్లు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మీ పిల్లల స్నేహితులు కూడా నిజాయితీగా ఉంటారో అప్పుడు కూడా నిజాయతీగా ఉండడాన్ని నేర్చుకోడానికి అవకాశం ఉంది. కాబట్టి మీ పిల్లలు స్నేహితులపై కూడా మీరు కాస్త దృష్టి పెట్టడం మంచిది. మంచి ఫ్రెండ్స్ తో ఉంటే మంచి దారిలో వెళ్లడం జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version