వూహాన్ లో డ్రామా నడుస్తోందా ? వాళ్ళు చెప్పే కథ ఎక్కడా నమ్మేలా లేదు !

-

ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్ పుట్టినిల్లు వూహాన్. ఈ నగరంలో పుట్టినా కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచంలో 200 దేశాలకు పైగానే వ్యాప్తి చెందింది. దాదాపు కొన్ని వేల మందిని ఈ వైరస్ బలి తీసుకుంది. లక్షల మంది శరీరాలలో సోకి ఉంది. చాలా వరకు ఇదంతా చైనా దేశమా ఆడుతున్న డ్రామా అని వూహాన్ ల్యాబ్ లో దాచి ఉంచి రిలీజ్ చేశారని ప్రపంచ దేశాలలో ప్రముఖ దేశాల ఇంటెలిజెన్స్ వర్గాలు అంటున్నాయి.ఏకంగా అమెరికా దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అయితే కరోనా వైరస్ గురించి మాట్లాడుతున్న ఈ సందర్భంలో ప్రతి సారి ఇది చైనా వైరస్ అని సంభోదిస్తున్నారు. ఇక డ్రాగన్ హిస్టరీ చూస్తే కూడా చాలావరకు వెన్నుపోటులే. ఇప్పుడు కూడా ఏదో చేసి ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. కరోనా వైరస్ పుట్టినిల్లు వూహాన్ నగరంలో దాదాపు 76 రోజులపాటు చైనా ప్రభుత్వం లాక్ డౌన్ విధించడం జరిగింది. ఏప్రిల్ 8 నుంచి ఆంక్షల్ని సడలించారు.

 

కాగా తాజాగా వూహాన్ నగరంలో కరోనా కేసులు ఇప్పుడు జీరోకు చేరుకున్నట్లు చైనా ప్రభుత్వం తెలిపింది. మరోపక్క చైనా వ్యాప్తంగా అన్ని షాపులు ఓపెన్ అయ్యాయి. ఆర్థిక రాజధాని షాంఘైలో మార్కెట్లు సందడిగా మారాయి. వాటికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. దీంతో ఓ పద్ధతి ప్రకారం ప్రపంచ దేశంలో కి వైరస్ పంపించేసి చైనా కూయుక్తిగా వ్యవహరిస్తుందని… వూహాన్ వేదికగా చైనా ప్రభుత్వం స్కెచ్  వేసిందని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  

Read more RELATED
Recommended to you

Exit mobile version