ఘనంగా హీరో కార్తికేయ వివాహం..స్పెషల్ గెస్ట్ గా మెగాస్టార్

-

టాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తి కేయ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఇవాళ ఉదయమే… హీరో కార్తి కేయ ప్రేమించిన అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేసి… ఆమెను తన అర్ధాంగి గా మార్చు కున్నాడు. ఆగస్టు లో గ్రాండ్‌ గా నిశ్చి తార్థం జరుపుకున్న యంగ్‌ హీరో కార్తి కేయ… ఇవాళ ఉదయం 9 గంటల 47 నిమిషాలకు లోమిత ను పెళ్లి చేసుకున్నాడు.

ఇక కార్తి కేయ పెళ్లి నేపథ్యంలో… అంగరంగ వైభరంగా పెళ్లి ఏర్పాట్లను చేశారు. ఇక కార్తికేయ పెళ్లి కావడంతో… ఆయన బంధువులతో పాటు పలుగురు టాలీవుడ్‌ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇందులో మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఉండటం గమనార్హం. ముఖ్య అతిది విచ్చేసిన మెగాస్టార్‌ చిరంజీవి… నూతన వధువరులను ఆశీర్వ దించారు. అయితే.. ఈ పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా… హీరో కార్తి కేయ… ఇటీవలె.. రాజా విక్రమార్క సినిమాలో కథానాయకుడిగా నటించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version