‘గాడ్ ఫాదర్’ సినిమా ప్రమోషన్లో భాగంగా చిరంజీవిని దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా పూరీ అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానమిచ్చారు. అయితే చిరంజీవి మరో గుడ్ న్యూస్ కూడా చెప్పారు. రాబోయే రోజుల్లో కామెడీ ఓరియెంటెడ్ సినిమాలు కచ్చితంగా చేస్తానని చెప్పారు.
ఇంటర్య్వూలో పూరీ పలు ఆసక్తికర ప్రశ్నలు సంధించారు. దీనికి అంతే సులువుగా సమాధానమిచ్చారు మెగాస్టార్. అందులో భాగంగా మీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరు అని అడిగితే… ‘ఇప్పటి వాళ్లలో ఎవరూ లేరు. నాకు చాలా ఇష్టమైన రాజకీయ నాయకుడు లాల్ బహుదూర్ శాస్త్రి. ఆయన గొప్ప నాయకుడు.. మాహానుభావుడు’ అని కొనియాడారు. ఆ తర్వాత ‘అటల్ బిహారి వాజ్‌పేయీ అద్భుతమైన నాయకుడు’ అని.. ‘రియల్ స్టేట్స్‌మన్’ అని అన్నారు.
ఆ తర్వాత స్క్రిప్ట్‌లు ఎలా సెలెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో అడిగిన ప్రశ్నకు ‘స్టోరీ నా హృదయానికి టచ్ కావాలి… పాటలు, కామెడీ, ఫైట్స్ అన్నీ.. ఓ స్త్రీ మూర్తికి అలంకారాల లాంటివి. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఫ్లాప్‌లు వస్తాయి. మనం మానవ మాత్రులం.. అందుకే ఇవన్నీ జాగ్రత్తగా గమనించాలి’ అని చెప్పుకొచ్చారు. ‘ప్రేక్షకులు మామూలు వాళ్లు కాదు.. ముందు అలా ఎలా గెస్ చేస్తారు’ అని సినిమాను ముందుగానే ప్రేక్షకులు హిట్ అని చెబుతారు అన్నారు. పూరీ.. సల్మాన్ ఖాన్ గురించి అడిగిన ప్రశ్నకు.. ‘అతడు నాకు తమ్ముడి లాంటి వాడు’ అని చెప్పారు.
మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూరీ జగన్నాథ్.. గోవర్ధన్ అనే యూట్యూబర్ పాత్ర చేశారు. యువ నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్ర పోషించారు. నయనతార, సముద్ర ఖని, సల్మాన్ ఖన్ కూడా పలు పాత్రలు చేశారు. దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల అయిన ‘గాడ్ ఫాదర్’… బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.