ఆ విషయంలో ఫీలవుతున్నా.. పాలిటిక్స్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు..

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెం.150’ చిత్రంతో ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ విదితమే. ప్రజెంట్ ఆయన వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇండస్ట్రీ పెద్దగా కాకుండా బిడ్డగా చిత్ర పరిశ్రమకు అవసరమైన సహాయ సహకారాలు తన వంతు బాధ్యతగా అందిస్తున్నారు. ఇకపోతే రాజకీయాల్లోకి వెళ్లడం గురించి ఇప్పటికే చాలా సార్లు మాట్లాడిన చిరంజీవి.. తాజాగా మరోసారి తన పొలిటికల్ ఎంట్రీ, పరిస్థితుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరైన చిరంజీవి.. అక్కడ రాజకీయాలపై మాట్లాడారు. ఫిల్మ్ గురించి మాట్లాడుతూ.. తన మీద నమ్మకంతో మూవీ చూడాలని కోరారు. ఈ క్రమంలోనే తాప్సీ పన్ను లాంటి హీరోయిన్ ను చూసినపుడు తాను పాలిటిక్స్ లోకి ఎందుకు వెళ్లానా? అని అనిపించిందని అన్నారు. తాప్సీ పన్ను నటించిన పిక్చర్స్ చూసినపుడు తనకు చాలా ఆనందం కలిగిందని, ఇంత పవర్ ఫుల్ గా తాప్సీ నటించిందా? అని అనుకుంటానని వివరించాడు. అటువంటి అమ్మాయితో తను కలిసి నటించే అవకాశాన్ని దక్కించుకోలేకపోయానని అన్నారు చిరు.

మొత్తంగా తాప్సీ పన్నుతో కలిసి నటించాలనే తన మనసులో మాటను చిరంజీవి చెప్పకనే చెప్పారు. ‘మిషన్ ఇంపాజిబుల్’ ఫిల్మ్ ప్రొడ్యూసర్ నిరంజన్‌ మీద ఉన్న ప్రేమతో తాను ఈ ఈవెంట్‌కు వచ్చినట్లు చెప్పాడు. ఇది చిన్న సినిమా కాదని అందరినీ ఆకట్టుకునే పెద్ద సినిమా అని అన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చించేస్తున్నదని, రాజమౌళి ఆ చిత్రంతో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు. రాజమౌళిని, ఆయన టీమ్ ను అభినందిస్తున్నట్లు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version