అల్లు అర్జున్ పై ఎమోషనల్ ట్వీట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి !

-

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ను ప్రశంసిస్తూ మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఈ ట్వీట్ లో అల్లు అర్జున్ సినీ కెరీర్ ను స్టార్ట్ చేసి అప్పుడే 20 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఒక్కసారిగా నీ చిన్ననాటి జ్ఞాపకాల నుండి ఇప్పటి పాన్ ఇండియా స్టార్ గా మారిన వరకు ప్రతి ఒక్కటీ కళ్ళముందు మెదులుతోంది అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇంత వేగంగా సమయం గడిచిపోయింది అంటూ తనను తానే మరిచిపోయి బన్నీ సక్సెస్ ను గుర్తు చేసుకున్నాడు చిరంజీవి.

అల్లు అర్జున్ తన కెరీర్ లో ఇంకా గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకుంటూ చిరంజీవి ట్వీట్ చేశాడు. మాములుగా ఈ ట్వీట్ లో ఎంతటి రిలేషన్, ఇద్దరి మధ్య బాండింగ్, లవ్ అండ్ అఫెక్షన్ ఉందో చూసిన ప్రతి ఒక్కరికీ అర్ధం అవుతుంది. బన్నీ సినిమా రోజుల ఫంక్షన్ కు సంబంధించిన ఫోటోను షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ ట్వీట్ కు అల్లు అర్జున్ ధన్యవాదములు తెలుపుకుంటూ … మీ మీద ఎప్పటికీ నాకు కృతజ్ఞతలు ఉంటాయని చెప్పాడు. కాగా చివర్లో చికబాబి అంటూ ముగించాడు.

Read more RELATED
Recommended to you

Latest news