పెగాసస్‌పై విచారణకు సీజేఐ గ్రీన్ సిగ్నల్

-

న్యూఢిల్లీ: దేశంలో పెగాసస్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. పెగాసస్ స్పైవేర్ అనే సాఫ్ట్‌వేర్ ద్వారా ఫోన్లు ట్యాప్‌కు గురవుతున్నాయని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పార్లమెంట్‌లో చర్చ, దర్యాప్తునకు పట్టుబడుతున్నారు. దీంతో లోక్‌సభ రాజ్యసభలు వాయిదా పడుతున్నాయి. మరోవైపు పశ్చిమబెంగాల్ ప్రభుత్వంతో పాటు పలువురు నేతలు…పెగాసస్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ చేపట్టాలని కోరారు. పిటిషన్‌లో కేంద్రప్రభుత్వంతో పాటు హోంశాఖను ప్రతివాదులుగా చేర్చారు.

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్పందించారు. పెగాసస్‌పై విచారణ జరపాలని ఆదేశించారు. ఆగస్టు మొదటి వారంలో మంగళ, బుధవారం తప్ప మిగిలిన రోజుల్లో విచారణ చేపట్టాలని సీజేఐ సూచించారు. దీంతో పెగాసస్‌పై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో వచ్చే వారంలో విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version