హీరో శర్వానంద్‌ పెళ్లి ఆగిపోయిందా.. క్లారిటీ ఇచ్చిన టీం..

-

ప్రభాస్ పెళ్లి తర్వాతే తాను పెళ్లి చేసుకుంటానని చెప్పిన యంగ్ హీరో శర్వానంద్.. ప్రభాస్ కంటే ముందే పెళ్లి పీఠలెక్కడానికి రెడీ అయిపోయాడు. కొన్ని నెలల కిందటే ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నాడు. కానీ ఈ మధ్య శర్వానంద్ ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయినట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా దీనిపై క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం సినిమాల పరంగా రేసులో వెనకబడిపోయాడు శర్వానంద్. చివరగా చేసిన ఆడవాళ్లు మీకు జోహార్లు, ఒకే ఒక జీవితం సినిమాలు అంతగా అలరించలేకపోయాయి.

‘శర్వానంద్‌- రక్షితల పెళ్లి ఆగిపోలేదు. వాళ్లిద్దరూ సంతోషంగా ఉన్నారు. శర్వానంద్‌ ప్రస్తుతం శ్రీరామ్‌ ఆదిత్య డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే లండన్‌లో 40 రోజుల షెడ్యూల్‌ పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చాడు. తను ఒప్పుకున్న ప్రాజెక్టులను పూర్తి చేశాకే పెళ్లిపై పూర్తి స్థాయిలో ఫోకస్‌ చేస్తాడు. ఇప్పుడతడు సిటీలోనే ఉన్నాడు కాబట్టి ఇరు కుటుంబాలు కలుసుకుని పెళ్లికి మంచి ముహూర్తం ఫిక్స్‌ చేస్తారు. ఆ పెళ్లి తేదీని కూడా అధికారికంగా ప్రకటిస్తాం’ అని చెప్పుకొచ్చారు. దీంతో శర్వానంద్ పెళ్లిపై వస్తున్న రూమర్స్ కి చెక్ పడింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version