టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు గత రాత్రి ప్రకటించాడు. దీంతో సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకూ ఎంతోమంది ధోనీ రిటైర్మెంట్‌పై స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ స్పందించారు. కంగ్రాచ్యులేషన్స్ ధోనీ. మహోజ్వలమైన కెరీర్ ను సొంతం చేసుకున్నావు. నువ్వు సాధించిన ప్రాభవం తరతరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఔత్సాహికులకు ధోనీ ఘనతలు ప్రేరణ కలిగిస్తాయి. నీ భవిష్యత్ ప్రణాళికలు విజయవంతం కావాలని ట్వీట్ చేసారు.
Congratulations @msdhoni on a magnificent career. The legacy you are leaving behind will continue to inspire generations of cricket enthusiasts around the world. Best wishes for your future endeavours.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 15, 2020
అలాగే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా ధోనీ రిటైర్మెంట్‌పై ట్విట్టర్‌లో స్పందించారు. ‘జీవితంలో ఓ కొత్త ప్రయాణాన్ని మొలుపెట్టబోతున్న ధోనీకి ఆల్ ది బెస్ట్. ఇక నుంచి ధోనీని టీమిండియా జెర్సీలో చూడటాన్ని మిస్సవుతాం. అలాగే ధోనీ ఇచ్చే అత్యుత్తమ క్రికెట్ క్షణాలను కోల్పోతాం.ఏదేమైనా భారత్ గర్వపడేలా చేశావు. దాన్ని మేము ఎంతగానో గౌరవిస్తాం. ఇక వీడ్కోలు.’ అని పేర్కొన్నారు.
I wish @msdhoni all the best as he embarks on a new journey in life. We will miss you donning the Indian jersey and giving us some of the best cricketing moments. You’ve made India proud and we value that very much. Farewell #MSDhoni pic.twitter.com/y7LmWH6TL0
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) August 15, 2020