వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి షాక్ ఇచ్చారు.విశాఖ పార్టీ బాధ్యతల నుంచి ఆయనను తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.ఆ బాధ్యతలను బాబాయి వై వి సుబ్బారెడ్డి కి అప్పగించారు.మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్ రెడ్డి లకు మాత్రం 62 నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు.విజయసాయి రెడ్డి కి మాత్రం బాధ్యతలు అప్పగించలేదు.వైవీ సుబ్బారెడ్డికి విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు.విశాఖ కేంద్రంగా నేటి వరకు పార్టీ, ప్రభుత్వం తరఫున బాధ్యతలు నిర్వహించిన విజయసాయి పై పార్టీలోని నేతలే అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలో లో భూ ఆక్రమణలకు సంబంధించి పలు ఆరోపణలు..అదేవిధంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆ పార్టీ నేతల నుంచి ఆరోపణలు రావడం.ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రాముఖ్యత పెరిగింది.పార్టీ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులను సమన్వయం చేసే బాధ్యతలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అప్పగించారు.ఇక విజయసాయి రెడ్డి గతంలోఉన్న పదవి అనుబంధ విభాగాల ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించారు.ఇక నుంచి ఆయన తాడేపల్లి కేంద్రంగా పని చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.