పెట్రోల్ ధరలపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వాహనదారులకు బిగ్ షాక్ ఇచ్చారు. ఇతర రాష్ట్రాల తరహాలో… పెట్రోల్ ధరలు తగ్గించమని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. పెట్రోల్ మరియు డీజిల్ ధరలు తగ్గించే ప్రశ్నే లేదని క్లారిటీ ఇచ్చారు. మేము ఏడేళ్ల లో వ్యాట్ పెంచలేదన్నారు. మమ్ముల్ని తగ్గించమని అడిగేది ఎవరు ? అని ప్రశ్నించారు.
కేంద్రం మొత్తం సెస్ తగ్గించాలని డిమాండ్ చేశారు కెసిఆర్. అవసరం అయితే.. పెట్రోల్ మరియు డీజిల్ ధరలు తగ్గించాలని ఢిల్లీ వెళ్ళి పోరాటం చేస్తామని హెచ్చరించారు సిఎం కెసిఆర్. తెలంగాణలో పంట పండితే మీ కళ్లు మండుతున్నాయా? ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తామనీ ఫైర్ అయ్యారు. పంజాబ్ ధాన్యం కొని తెలంగాణ ధాన్యం ఎందుకు కొనరు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.