వేజ్ లాస్‌ను భ‌ర్తీ చేయ‌డ‌మే కేసీఆర్ కిట్ వెనుకాల ఉన్న ఫిలాసఫీ : సీఎం కేసీఆర్‌

-

రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన కేసీఆర్ కిట్‌పై సీఎం కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్ కిట్ అంటే నాలుగు స‌బ్యులు.. మూడు వ‌స్తువులు కాదు అని స్ప‌ష్టం చేశారు. వేజ్ లాస్‌ను భ‌ర్తీ చేయ‌డ‌మే కేసీఆర్ కిట్ వెనుకాల ఉన్న ఫిలాస‌ఫీ అని కేసీఆర్ వివ‌రించారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి వ‌ర్చువ‌ల్ విధానంలో 9 మెడిక‌ల్ కాలేజీల‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ ప్ర‌సంగించారు.నీతి ఆయోగ్ ఇచ్చే హెల్త్ డిపార్ట్‌మెంట్ ఇండికేట‌ర్స్‌లో 2014లో మ‌న ర్యాంకు 11 వ‌స్థానంలో ఉండేది. ఇప్పుడు దేశంలో 3వ స్థానానికి ఎదిగాం అని కేసీఆర్ తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ప్రతి లక్ష జనాభాకు 22 మెడికల్ సీట్లతో భారతదేశంలోని ఏకైక రాష్ట్రంగా తెలంగాణను ముందుకు తీసుకెళ్లిన హరీష్‌రావు నాయకత్వాన్ని ప్రశంసించారు. 2014లో 17,000 ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల పడకలను ప్రస్తుతం 34,000కు పెంచుతున్నట్లు ఆయన వివరించారు. హైదరాబాద్‌లో నాలుగు తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆస్పత్రులు, వరంగల్‌లో ఒకటి, నిమ్స్ సామర్థ్యాన్ని 2,000 నుండి 4,000 పడకలకు పెంచడంతో పాటు, రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే 50,000 పడకలు ఉన్నాయని ఆయన అన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version