వానాకాలం పంట చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కోసం 6600 పైచిలుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని.. అవసరమైతే మరిన్ని కేంద్రాలను ఓపెన్ చేస్తామని కేసీఆర్ తెలిపారు. రైతులు ధాన్యం తేవడానికి తొందరపడకూడదని కేసీఆర్ సూచించారు. వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కొన్ని రోజుల వరకు పంటను కోయవద్దని సూచించారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెవడానికి తొందర పడవద్దని తెలిపారు.
మరోవైపు బీజేపీ నాయకులపై మరోసారి కేసీఆర్ ఫైరయ్యారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ముందు చెంపలు వేసుకుని క్షమాపణ కోరాలన్నారు. వారి బండారం బయటపడిందన్నారు. ఉద్యమం చేస్తున్న రైతులను ఉగ్రవాదులు, ఆందోళన కారులుగా నిందలు వేశారన్నారు. ఇప్పుడు మీరే కదా..క్షమాపణలు కోరుతున్నారని ఎద్దేవా చేశారు.