తెలంగాణ మరో కల్లోలంలోకి జారిపోవద్దు..అప్రతిహతంగా దూసుకు పోవాలి – సీఎం కేసీఆర్‌

-

తెలంగాణ మరో కల్లోలంలోకి జారిపోవద్దు..అప్రతిహతంగా దూసుకు పోవాలని సీఎం కేసీఆర్‌ కోరారు. పబ్లిక్‌ గార్డెన్స్‌లో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు.. జరిగాయి. అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్‌ నివాళులు అర్పించి…మాట్లాడారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ మతోన్మాదశక్తులు పేట్రేగి పోతున్నాయి…తమ సంకుచిత ప్రయోజనాల కోసం సామాజిక సంబంధాల నడుమ ముళ్లకంపలు నాటుతున్నాయని ఆగ్రహించారు.

విద్వేషపు మంటలు రగిలిస్తూ, విష వ్యాఖ్యలతో ఆజ్యం పోస్తున్నాయని.. మనుషుల మధ్య ఈ రకమైన విభజన ఏ విధంగానూ సమర్థనీయం కాదని పేర్కొన్నారు. మతం చిచ్చు ఈ విధంగానే విజృంభిస్తే అది దేశం యొక్క, రాష్ట్రం యొక్క జీవికనే కబళిస్తుందన్నారు. మానవ సంబంధాలనే మంట గలుపుతుంది…జాతి జీవనాడిని కలుషితం చేస్తుందని వెల్లడించారు. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17 సందర్భాన్ని సైతం వక్రీకరించి, తమ సంకుచిత స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే నీచమైన ఎత్తుగడలకు ఈ విచ్ఛిన్నకర శక్తులు పాల్పడుతున్నాయని కేసీఆర్‌ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version