బోనాలు వద్దు అంటున్న కేసీఆర్…?

-

తెలంగాణాలో కరోనా తీవ్రత పెరుగుతూ పోతుంది గాని ఎక్కడా కూడా తగ్గడం లేదు అనే చెప్పాలి. రోజు రోజుకి వందల కేసులు నమోదు అవుతున్నాయి గాని ఎక్కడా కూడా పరిస్థితి అదుపులోకి వచ్చే సూచనలు అయితే దాదాపుగా లేవు అనే చెప్పాలి. దీనితో ఇప్పుడు తెలంగాణా సర్కార్ కొన్ని కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. కొన్ని కొన్ని విషయాల్లో కేసీఆర్ మరింత కఠినంగా ఉన్నారని అంటున్నారు.

నిన్న అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించగా ప్రతిష్టాత్మక బోనాల గురించి ప్రధానంగా చర్చ వచ్చింది. ఏటా ఆషాఢ మాసం ప్రారంభం మొదటి నుంచి అది ముగిసే వరకు కూడా గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో బోనాలలో వేలాది మంది ప్రజలు పాల్గొంటారు. ముందు గోల్కొండ బోనాలు, తర్వాత లష్కర్‌, చివరికి లాల్‌దర్వాజ బోనాలతో బోనాల సందడి అనేది ముగుస్తుంది.

ఇక శ్రావణ మాసంలో తెలంగాణ అంతటా బోనాల పండుగ ఉంటుంది. లక్షల మంది ప్రజలు బోనాల కోసం పాల్గొనే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు గనుక దానికి అనుమతి ఇస్తే మాత్రం పరిస్థితి ఊహకు కూడా అందే సూచనలు ఉండవు. లక్షల మంది పాల్గొనే ఈ వేడుకల్లో సామాజిక దూరం అనే మాట ఎక్కడా వినపడదు. అది సాధ్యం కాదు కూడా. అందుకే కేసీఆర్ బోనాలు అనే మాటను ఈ ఏడాది మర్చిపోవాలి అని భావిస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version